![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1075 లో.. రాజు దుగ్గిరాల ఇంట్లో ఉంటే ఆ రేఖ ఏమైనా చేస్తుందేమోనని చలపతి బయపడి తమతో వచ్చేయని అంటాడు. నేను రాలేను నాన్న అని రాజు చెప్తాడు. నువ్వు మారిపోయావురా ఈ ఆస్తులు చూసి కన్నవారిని మర్చిపోయావని రాజుతో చెప్తూ చలపతి ఎమోషనల్ అవుతాడు. నీకు మేం ముఖ్యమా ఆ అమ్మాయి ముఖ్యమా.. మాతో వచ్చేయ్ అని చలపతి అనగానే రానని రాజు తెగేసి చెప్తాడు. నువ్వు ఏంటో పూర్తిగా అర్థం అయింది.. నీ వాళ్ళు నీకు లేరు అని చలపతి అంటాడు. ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూస్తే బాగనపించింది కానీ ఇప్పుడు నా కొడుకుని నా ఇంటికి దూరం చేసావని ఇందుతో చలపతి అంటాడు.
దాంతో ఇందు బాధపడుతుంది. చలపతి, లక్ష్మీ ఇంటికి వెళ్తారు. ఎందుకు అండి వాడితో అంత కఠినంగా మాట్లాడారని లక్ష్మీ అడుగుతుంది. అలా మాట్లాడితే అయిన వాడు వస్తాడనుకున్నాను కానీ రాలేదు.. వాడు లేకపోతే మనం ఎలా ఉండగలం లక్ష్మీ అని చలపతి బాధపడుతాడు. ఏ అండా లేని ఆ కుటుంబానికి అండ కావాలని ఆ దేవుడే పంపించి ఉండొచ్చు కదా అని లక్ష్మీ అంటుంది. మరొకవైపు మనం అనుకున్నది ఏంటి.. అయింది ఏంటి.. ఆ రాజు గాడు వెళ్తాడనుకుంటే ఇలా అయింది ఏంటని భ్రమరాంబ అంటుంది. ఇంకేముంది ఇక మెల్లిగా ఆస్తులు మొత్తం సొంతం చేసుకుంటాడు. ఇరవై అయిదు ఏళ్లుగా ఎదరుచూస్తున్నామని భూషణ్ అంటాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు.. వాడు వెళ్ళలేదు కానీ ఇందు ఎమోషనల్ ఫూల్.. వాడి నాన్న మాటలకి అదే వాడిని పంపిస్తుంది. ఒక వేళ పంపించకున్నా సరే మనకి ఛాన్స్ దొరికిందని వాళ్లతో రేఖ అంటుంది.
మరొకవైపు ఎందుకు ఇలా చేసావ్ రాజు వెళ్లి ఉండాల్సిందని ఇందు అనగానే నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావ్ కదా అని రాజు అంటాడు. పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వెళ్ళు అని ఇందు అంటుంది. నేను వెళ్ళను.. నీకు తోడుగా ఉండడం నా బాధ్యత అని రాజు అంటాడు. తరువాయి భాగంలో నువ్వు ఈ డబ్బు కోసమే కదా ఉంటుంది.. ఇదిగో తీసుకొని వెళ్ళు అని ఇందు అనగానే మన మధ్య ఏ బంధం లేదా అని రాజు అంటాడు. దాంతో ఇందు షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |